మహిళలతోనే రాయగడ ఎక్స్‌ప్రెస్
VSP: విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు సందర్భంగా వాల్తేరు డివిజన్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో సోమవారం నడిపింది. రైలును డీఆర్‌ఎం లలిత్ బోహ్రా జెండా ఊపి ప్రారంభించారు. వాల్తేరు డివిజన్‌లో 1,600లకు పైగా మహిళలు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు.