గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎంఎస్ రావు సీట్లోనే కుప్పకూలిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నెల్లూరు డిపోకు చేరకోగానే బస్సులో ఉన్న రెండో డ్రైవర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి డ్రైవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అతడు గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.