టమాటా కనిష్ఠ ధర రూ.7లు

టమాటా కనిష్ఠ ధర రూ.7లు

ATP: రూరల్ కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.20 పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం 1050 టన్నుల టమాటా వచ్చింది. కిలో సరాసరి ధర రూ.13లు, కనిష్ఠ ధర రూ.7లుగా నమోదైంది. మార్కెట్లో టమాటా ధరలు క్రమేణా తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.