క్రీడలకు ఎంపికైన బాలికలను అభినందించిన కలెక్టర్

క్రీడలకు ఎంపికైన బాలికలను అభినందించిన కలెక్టర్

NGKL: జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడలకు ఎంపికైన బాలికలను కలెక్టర్ బదావత్ సంతోష్ శుక్రవారం తన చాంబర్‌లో అభినందించారు. 17 సంవత్సరాల విభాగంలో పి. అక్షర, 14 సంవత్సరాల విభాగంలో దివ్యాంజలి ఎంపికయ్యారు. ఈనెల 18 నుంచి 22 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడల జిల్లా అధికారి సీతారాం తదితరులు పాల్గొన్నారు.