అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీటీసీ

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీటీసీ

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని శనివారం నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ అంటరానితనం, అసమానతలు, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడని, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు.