సరస్వతి ఆలయానికి రూ. లక్ష విరాళం

సరస్వతి ఆలయానికి రూ. లక్ష విరాళం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి ఆలయానికి నారాయణపేటకు చెందిన సామాజిక సేవాకర్త రాజ్ కుమార్ రెడ్డి రూ. లక్ష విరాళం అందించారు. బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఈ చెక్కును అందజేశారు. ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాములు, హరి ప్రసాద్, రాజేష్, వెంకట్రాంరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.