ప్రభుత్వ పాఠశాలలో 1,36,781 విద్యార్థులకు రాగి జావ

KNR: దసరా సెలవుల అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించారు. సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో జావ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,36,781 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కాగా పిల్లలకు పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా రాగి జావ అందిస్తున్నారు.