సోషల్ మీడియాలో వచ్చే సందేశాలతో జాగ్రత్త

సోషల్ మీడియాలో వచ్చే సందేశాలతో జాగ్రత్త

ASF: సోషల్ మీడియాలో వచ్చే సందేశాలన్నీ నిజం కాకపోవచ్చని, వాటితో జాగ్రత్తగా ఉండాలని కౌటాల CI ముత్యం రమేశ్ అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించవచ్చు లేదా మీకు జాబ్ వచ్చింది అంటూ వచ్చే సందేశాలను నమ్మొద్దన్నారు. వైరల్ న్యూస్, డిస్కౌంట్ ఆఫర్స్ వంటి విషయాలను నమ్మేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు బలి కావొద్దన్నారు.