రేపు పీజీఆర్ఎస్ రద్దు

ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేసినట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. నూజివీడులో సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం రాత్రి మాట్లాడుతూ.. అధిక వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు.