రైతుల ఖాతాలలో వరి ధాన్యం నగదు జమ
MNCL: జిల్లాలో 2025-26 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తెలిపారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల, గుల్లకోటలలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో నగదు జమ చేసినట్లు వెల్లడించారు.