VIDEO: గుంతలమయంగా అంతర్రాష్ట్ర రహదారి
ADB: తలమడుగు మండలం మల్కుపల్లె నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడటంతో వాహనదారులు ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.