వయోజనులకు ఉల్లాస్ పరీక్ష

KRNL: ఉదయగిరి మండలంలోని వృద్ధులకు ఆదివారం డీఆర్డిఏ ఆధ్వర్యంలో ఉల్లాస్ పరీక్ష నిర్వహించారు. మండలంలో 18 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు సీసీలు, వీవోఏలు నిర్వహించారు. మొత్తం 321 మందికి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను ఏపీఎం ఖాజా రహమతుల్లా పర్యవేక్షించారు. మండలంలో ఉల్లాస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.