ఇళ్ల స్థలాల భూసేకరణపై కలెక్టర్‌కు MLA వినతి
E.G: వాడపల్లి మద్దూరు, మద్దూరులంక, సీతంపేట వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేశారు. గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వీటిపై చర్చించారు. బంగారమ్మపేట సమీపంలో ఉన్న వాటర్ గిడ్ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని BC గురుకులకు కేటాయించాలన్నారు.