ప్రధాన రహదారిపై పడిపోయిన భారీ చెట్టు

BDK:కూనవరం మీదుగా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులు గమనించగలరు. బుట్టాయిగూడెం ప్రధాన రహదారిపై భారీ చింత చెట్టు వర్షం కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. వాహనదారులు గమనించి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని స్థానికులు పేర్కొన్నారు.