నెల్లూరులో బాలుడు మిస్సింగ్
నెల్లూరులోని బుజబుజనెల్లూరు డీవీఎన్ఎం హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న పీ.డేవిడ్ మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నాం స్కూలుకు వెళ్లిన డేవిడ్ ఇంటికి రాకపోవడంతో రాత్రి వరకు వేచి చూసిన తల్లిదండ్రులు పట్నం మణి, రాజమ్మ వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.