తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నియోజకవర్గం నాయకులతో కలిసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.