రూ. 3.74 లక్షల విలువైన ఎరువులు సీజ్

రూ. 3.74 లక్షల విలువైన ఎరువులు సీజ్

ATP: స్థానిక భాస్కర్ అగ్రి సొల్యూషన్ దుకాణంలో వ్యవసాయ శాఖ గుత్తి ఏడీఏ వెంకట రాముడు, రూరల్ ఏవో వెంకట్ కుమార్ బుధవారం తనిఖీలు చేపట్టారు. సరైన అనుమతులు పత్రాలు లేని కారణంగా నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన రూ. 3.74 లక్షల విలువైన ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశామని ఏడీఏ వెంకటరాముడు తెలిపారు.