ఎన్నికలు.. సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు: సీపీ

ఎన్నికలు.. సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలు: సీపీ

KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాధపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.