'వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి'

MLG: జిల్లా కేంద్రంలోని రైతు వేదికకు వెళ్లే రోడ్డు గుంతలు, బురదతో అధ్వాన్నంగా మారింది. పక్కనే జీసీసీ జిల్లా కార్యాలయం ఉన్నప్పటికీ, విధులకు వచ్చే ఉద్యోగులు, సమావేశాలు, అవసరాల కోసం వచ్చే రైతులు, ప్రజలు ఈ రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.