10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ

10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ

ATP: పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాప్తాడు మండలంలోని 9 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు SSC, యూటీఎఫ్ మోడల్ టెస్ట్ పేపర్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కలిసి 377 మంది విద్యార్థులకు వీటిని అందించారు. విద్యార్థులు బాగా చదివి, మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే కోరారు.