VIDEO: నోట్ల కట్టలతో శ్రీ కృష్ణుని అలంకరణ

E.G: రాజమండ్రి ఆర్యాపురంలోని శ్రీ కృష్ణ చైతన్య మిషన్, ఆశ్రమంలో ఆశ్రమం ఇన్‌ఛార్జ్ శ్రీ పాద హరిదాస్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా చేశారు. ఈ సందర్భంగా శ్రీ రాథా కృష్ణ ఉయ్యాల సేవలో కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.