VIDEO: పిట్టగూడలో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య
ASF: తిర్యాణి మండలం పిట్టగూడలో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన హనుమంతుపై అదే గ్రామానికి చెందిన సిడాం వినోద్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. అతడి భార్యపై కూడా దాడి చేయగా ఆమె స్వల్ప గాయాలతో తప్పించుకుంది. ప్రస్తుతం ఆమె ఆసిఫాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.