కాశీబుగ్గ బాధితులకు వైసీపీ రూ.2 లక్షలు పరిహారం
AP: కాశీబుగ్గ ఘటన క్షతగాత్రులను వైసీపీ నేతలు పరామర్శించారు. జగన్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 'మీకు చేతకాకపోతే అఖిలపక్షం సలహా తీసుకోండి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలి' అని పేర్కొన్నారు.