రేపు ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి అధికారులకు తెలపాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తామన్నారు.