CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గ పట్టణవాసి హేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 67,113 చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వగృహం వద్ద అందజేశారు. ప్రజల కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులందరికీ సహాయం అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక, మానసిక బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.