కలకోట సర్పంచ్ అభ్యర్థి అనిత ఏకగ్రీవం
KMM: బోనకల్ మండలంలోని కలకోట గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పైడిపల్లి కిషోర్ సతీమణి అనిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రతిపక్ష పార్టీలంతా ఆమెకు మద్దతు పలకడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. అలాగే, గ్రామంలోని పది వార్డులకు సైతం ఒక్కో నామినేషనే రావడంతో సర్పంచ్ సహా వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి.