నియోజకవర్గ అభివృద్ధిపై కలిసి పని చేయాలి MLC
SKLM: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు నివాసానికి విచ్చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఈశ్వరరావు కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి సత్కరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి భాగస్వాములుగా కలిసి పనిచేయాలని MLC అన్నారు.