'మూడు నెలల వేతనాలు చెల్లించాలి'
SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ కొండయ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారు.