'ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి'
BDK: మణుగూరు రేగుల గండి చెరువు చుట్టూ పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని IFTU ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు నాజర్ పాషా మాట్లాడుతూ.. వేసవికాలంలో విహారయాత్రలకు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. భద్రతా చర్యలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.