నీటి సమస్యతో అల్లాడుతున్న బోస్రా గ్రామస్థులు

ADB: బజార్ హత్నూర్ మండలంలోని బోస్రా గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీరు సరిపోకపోవడంతో మహిళలు బావుల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీటీసీ గజానంద్ మాట్లాడుతూ.. గ్రామంలో నీటి సమస్య ఉందని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లేదన్నారు.