జిల్లాకు 430 టన్నుల దాణా మంజూరు: JD

జిల్లాకు 430 టన్నుల దాణా మంజూరు: JD

అన్నమయ్య జిల్లాకు 2వ విడత కింద 430 టన్నుల పశువుల దాణా మంజూరైనట్లు జిల్లా పశువర్ధక శాఖ JD కె. గుణశేఖర్ రెడ్డి తెలిపారు. మదనపల్లె, బి.కొత్తకోట, పెద్దమండెం, తంబళ్లపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం, నందలూరు, చిట్వేల్, ఓబులవారిపల్లె, కోడూరు, చిన్నమండెం, పీలేరు, సుండుపల్లె, వీరబల్లి మండలాలకు కేటాయించినట్లు వివరించారు. ఒక్కో రైతుకు 50 కిలోల బస్తా పంపిణీ చేస్తామన్నారు.