లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 1,497 మంది మృతి
ఇటు ఇరాన్, అటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసింది. MAR 2 నుంచి సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,497 మంది మరణించారు. అందులో 126 మంది చిన్నారులు ఉన్నారని లెబనాన్ అధికారులు వెల్లడించారు. 12 లక్షల మంది నిరాశ్రయులు కాగా, ఇజ్రాయెల్ బలగాలు సౌత్ లెబనాన్‌లోకి చొచ్చుకొస్తున్నాయి. ఇప్పటికే లెబనాన్ భూభాగంలో 14% ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి.