పర్యవేక్షణ లోపం.. పేరుకుపోతున్న చెత్త
BHPL: సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ల పర్యవేక్షణ లోపంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో చెత్త పేరుకుపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడ కుండీలు లేక చెత్త పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుండీల సంఖ్యను పెంచి నిత్యం చెత్తను తరలించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.