కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

KRNL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7 వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10 వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.