మనుషులని కాదు.. HIVని అంతం చేద్దాం!
నేడు 'ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం'. HIVపై భయం వద్దు.. బాధ్యతగా ఉందాం. ఈ వైరస్ సోకిన వాళ్లను దూరం పెట్టడం, వివక్ష చూపడం ఆపేద్దాం. నిత్యం మందులు వాడితే వాళ్లూ మనలాగే ఆరోగ్యంగా, పూర్ణాయుష్షుతో బతకొచ్చు. వారికి కావాల్సింది సానుభూతి కాదు, సమానత్వం. అపోహలను వీడదాం.. ఎయిడ్స్ రహిత సమాజం కోసం చేతులు కలుపుదాం. 'HIVని అంతం చేద్దాం.. మనుషులని కాదు' అనే స్ఫూర్తితో ముందుకు సాగుదాం.