అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండలం మానాయకుంట గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి మరణించిన సంఘటన నెలకొంది. బోండ వెంకటయ్య(50) కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. కిరాణ కొట్టు నడవకపోవడంతో అప్పుల పాలయ్యారని, అందుకే ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుమారుడు జశ్వంత్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.