టీడీపీ మహిళా అధ్యక్షురాలు మృతి పట్ల సీఎం సంతాపం

టీడీపీ మహిళా అధ్యక్షురాలు మృతి పట్ల సీఎం సంతాపం

కృష్ణా: గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. శిర్డీ నుండి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.