రేపు కలెక్టరేట్లో 'పీజీఆర్ఎస్' కార్యక్రమం
KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.