వాహనాల వేగ నియంత్రణ చర్యలు: ఎస్సై
TPT: పెళ్లకూరు మండలంలో నాయుడుపేట నుంచి తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటామని SI నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఆయన అధునాతన పరికరంతో రహదారిపై వెళ్లే వాహనాల వేగాన్ని పరిశీలించారు. అయితే అత్యంత వేగంగా నడిచే వాహనాలకు ఫైన్ విధించబడుతుందని, ఇది ప్రమాదాల నియంత్రణ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.