భారత ప్లేయర్లకు కానుకగా వజ్రాల ఆభరణాలు

భారత ప్లేయర్లకు కానుకగా వజ్రాల ఆభరణాలు

ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమిండియాకు సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, రాజ్యసభ ఎంపీ గోవింద్‌ ఢోలాకియా అరుదైన బహుమతిని ప్రకటించాడు. భారత జట్టు సభ్యులకు వజ్రాలు పొదిగిన ఆభరణాలను కానుకగా అందజేయనున్నట్లు ఆయన తెలిపాడు. అంతేకాకుండా, ఆటగాళ్లకు సోలార్‌ ప్యానెళ్లను కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆ వ్యాపారి వెల్లడించాడు.