సోషల్ మీడియా పోస్టులపై డీఎస్పీ హెచ్చరిక

సోషల్ మీడియా పోస్టులపై డీఎస్పీ హెచ్చరిక

కోనసీమ: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ హెచ్చరించారు. సెక్షన్ 30 అమలు నేపథ్యంలో సోమవారం లక్కవరం, కేసనపల్లి గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టుల వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.