VIDEO: 'జలహారతి' కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

VIDEO: 'జలహారతి' కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

W.G: నరసాపురం వశిష్ట గోదావరి నదీ తీరంలో ఇవాళ 'జలధార -జలహారతి' కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే నాయకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ గోదావరి మాతకు శాస్త్రోక్తంగా జలహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.