రైతులు పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి: ఏడీఏ

రైతులు పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి: ఏడీఏ

BPT: రైతులు పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు శెనగ, మినుము, మొక్కజొన్న సాగు చేసుకోవాలని ఏడీఏ సూచించారు. కొరిశపాడు మండలం కనగాన వారి పాలెంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పంటలలో చీడ పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపట్ల శాస్త్రవేత్త బాల మురళీధర్ అవగాహన కల్పించారు.