ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం టస్కర్ ఇదే..!

HYD: ఖైరతాబాద్‌లోని 69 అడుగుల గణేశ్ విగ్రహం నిమజ్జనం కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. భారీ విగ్రహాన్ని తరలించడానికి విజయవాడ నుంచి 26 చక్రాలు,100 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఉన్న భారీ టస్కర్ ట్రక్కును తెప్పించారు. శుక్రవారం అర్ధరాత్రి దర్శనాలు ముగిసిన తర్వాత విగ్రహాన్ని ఈ ట్రక్కుపైకి ఎక్కిస్తారు. శనివారం ఉదయం నిమజ్జన ఊరేగింపు ప్రారంభమవుతుంది.