VIDEO: భారీ వృక్షాల తొలగింపు

ELR: లింగపాలెం మండలం పరిధిలోని పి. నగరం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను తొలగించడం పట్ల పలువురు సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట భారీ వృక్షాలను తొలగించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి వాహన చోదకులు, బాటసారులకు నీడతో కాపాడుతున్న చెట్లను తొలగించే హక్కు, అనుమతి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు.