ఉలవపాడు మార్కెట్‌లో నేలకొరిగిన సపోటా ధరలు
ప్రకాశం: ఉలవపాడు మార్కెట్‌లో సపోట ధరలు నేలను తాకాయి. 2026 ఎడాది ఆరంభంలో ఫారిన్ రకం బస్తా(50కేజీ) రూ.700, పాల రకానికి రూ.800 చొప్పున ధల పలికింది. తర్వాత నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ గత నెల రోజుల వ్యవధిలో పారిన్ రకం రూ.200, పాల సపోటా ధర రూ.100కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కెట్ నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు సరుకు వెళ్తుంది.