'ఆత్మహత్యలు వద్దు.. పోరాటాలతోనే సాధించుకుందాం'

'ఆత్మహత్యలు వద్దు..  పోరాటాలతోనే సాధించుకుందాం'

SRPT: బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి పోరాటాలు చేయాలని, ఆత్మహత్యలు వద్దని బీసీ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం హుజూర్నగర్‌లో 42 శాతం రిజర్వేషన్ల అన్యాయానికి వ్యతిరేకంగా అగ్నికి ఆహుతి అయిన ఈశ్వర చారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మధు, నరసింహ చారి, అజయ్ కుమార్ పాల్గొన్నారు.