వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించాలని వినతి
KKD: వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ CPM పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా CPM మండల కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ... వేసవికాలంలో మంచినీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరారు.