ఆసిఫాబాద్ DEOగా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

ASF: జిల్లా విద్యాశాఖలో ఏడాదిగా ఇన్‌ఛార్జ్ DEO పాలన కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య ఇన్‌ఛార్జ్ డీఈవో కొనసాగతుండగా అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి అదనంగా DEOగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే దీపక్ తివారి DEOగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.