ఈ యాప్‌లతో జాగ్రత్త: CRPF

డేటింగ్, ఫాస్ట్ లోన్ యాప్‌ల వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని CRPF.. సిబ్బందిని హెచ్చరించింది. CRPF అధికారిక ప్లాట్‌ఫామ్‌ను అనుకరించే యాప్‌లు ఉన్నాయని, వీటితో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ యాప్‌లతో వ్యక్తిగత సమాచారం సేకరించి హనీట్రాప్ చేయోచ్చని పేర్కొంది.